మురళీనగర్: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజీలోని స్కిల్ హబ్‌లో నిరుద్యోగ యువతీ యువకులకు డ్రోన్ టెక్నాలజీ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించి ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. పదో తరగతి ఆపై అర్హత కలిగిన 18–45 వయస్సు కలిగినవారు ఈ కోర్సులో చేరవచ్చని చెప్పారు. మూడు నెలల పాటు డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ టెక్నీషియన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. 30 సీట్లు మాత్రమే ఉన్నా యని అర్హులైన వారు నేరుగా కాలేజీలోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 20 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు. వివరాలకు 728706 9457 నంబరులో సంప్రదించవచ్చని సూచించారు. కోర్సు పూర్తి చేసుకున్నవారికి టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. వీరి ఉపాధి అవకాశాలకు సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment