పెందుర్తి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంటలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివీ.. వేపగుంట రామాలయం వద్ద నివా సం ఉంటున్న పలుకూరి నాగరాజు, విజయలక్ష్మి(37) దంపతులు స్థానికంగా పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం విజయలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లిన నాగరాజు భార్య మరణాన్ని జీర్ణించుకోలేక పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు విజయలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన నాగరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఐ కె.వి.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment