ఐఈఐ కౌన్సిల్ సభ్యుడిగా ప్రకాశరావు
మురళీనగర్: భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ప్రొఫెషనల్ ఇంజినీర్ల అసోసియేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా(ఐఈఐ) జాతీయ స్థాయి కౌన్సిల్ సభ్యుడిగా మురళీనగర్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ కె.ఎన్.ఎస్ ప్రకాశరావు ఎన్నికయ్యారు. 1920లో స్థాపించిన ఈ సంస్థలో కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావడం అత్యంత విశేషంగా చెప్పుకుంటారు. దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా సభ్యులున్న ఈ అసోసియేషన్‌కు పలు రాష్ట్రాల్లో కేంద్రాలు ఉన్నా యి. ఈ సంస్థ ఇంజినీరింగ్ విద్య, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించి.. ఇంజినీర్లు, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ప్రొఫెషనల్ అభివృద్ధికి కృషి చేస్తోంది. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థకు విశాఖకు ప్రకాశరావు కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావడం గర్వకారణంగా పలువురు పేర్కొన్నారు. ఆయన నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. సంస్థతో 35 ఏళ్ల అనుబంధం ఉన్న ప్రకాశరావు ఐఈఐ విశాఖపట్నం లోకల్ సెంటర్ గౌరవ కార్యదర్శిగా సుమారు ఐదేళ్లు పనిచేశారు. గవర్నమెంట్ విశాఖపట్నం పాలిటెక్నిక్‌లో 1981 నుంచి డిసెంబర్ 2016 వరకు వివిధ హోదాల్లో పనిచేసి మెకానికల్ విభాగాధిపతిగా పదవీ విరమణ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో చీఫ్ కన్సల్టెంట్‌గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment