72 కేసుల ఛేదన.. రూ.88.52 లక్షల రికవరీ
● అక్టోబర్‌లో 116 చోరీ కేసుల నమోదు ● 102 మంది నిందితుల అరెస్ట్ ● 742.97 గ్రాముల బంగారం, 326.48 గ్రాముల వెండి రికవరీ ● 20 బైక్‌లు, 3 ఆటోలు, ఒక ట్యాంకర్ స్వాధీనం ● సీపీ శంఖబ్రత బాగ్చి
విశాఖ సిటీ: నగరంలో సమర్ధవంతమైన పోలీసింగ్, సాంకేతికత సహాయంతో భారీగా చోరీ కేసులను ఛేదించినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. పోలీస్ సమావేశ మందిరంలో మంగళవారం రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అక్టోబర్‌లో 116 చోరీ కేసులు నమోదయ్యాయని.. ఇందులో 72 కేసులను ఛేదించి 102 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరి నుంచి రూ.45,77,520 విలువైన 742.97 గ్రాముల బంగారం, 326.48 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.2,88,370 నగదుతో పాటు 20 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ట్యాంకర్, ల్యాప్‌టాప్, 8 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే రూ.42.75 లక్షలు విలువైన 285 మొబైళ్లను రికవరీ చేశామన్నారు. నేరాల నియంత్రణ కోసం అక్టోబర్‌లో నగరంలో కొత్తగా 294 సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి దొంగతనాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో నిఘా పెట్టినట్లు వివరించారు. అనంతరం రికవరీ చేసిన రూ.88,52,520 విలువైన బంగారం, వెండి, వాహనాలు, మొబైళ్లను బాధితులకు సీపీ చేతుల మీదుగా అందజేశారు. సమావేశంలో డీసీపీ(క్రైం) లతా మాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment