జీతాల కోసం నినదించిన ‘ఉక్కు’ మహిళలు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల జీతాల కోసం వారి కుటుంబసభ్యులు రోడ్డెక్కారు. మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఏడాదిగా రెండు విడతలుగా జీతాలు చెల్లించేవారు. రెండు నెలలుగా అవి కూడా సక్రమంగా ఇవ్వకుండా వేధిస్తున్నారు. సెప్టెంబర్‌కు చెందిన సగం జీతం పెండింగ్‌లో ఉండగా.. అక్టోబర్ జీతం 65 శాతం పెండింగ్ పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున బుధవారం సాయంత్రం ఉక్కు అమరవీరుల కూడలి నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు, అక్కడి నుంచి తిరిగి అమరవీరుల కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ బి.గంగారావు, సీఐటీయూ నాయకులు జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, వై.టి.దాస్‌లు మహిళల ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులు పి.శిరీష, ఎన్.భారతి, ఎం.నవ్య, సుజాత, వరలక్షి, లక్ష్మి, సుభాషిణి, వేణు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment