సమష్టి కృషితో జలవనరుల సంరక్షణ
మహారాణిపేట: జిల్లాలోని చెరువులు, సాగునీటి కాలువలు, జలధారలను సంరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక, సమష్టి కృషి అవసరమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జలవనరుల సంరక్షణ, ఇతర అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు మార్గదర్శకాలు జారీ చేశారు. నీటి వనరుల అదనపు నిల్వ సామర్థ్యాన్ని 23 వేల క్యూబిక్ మీటర్లకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని, ఆక్రమణలు తొలగించి, సరిహద్దులు గుర్తించాలని ఆ దేశించారు. నీటి వనరుల సంరక్షణకు ముందుకొచ్చిన ధాన్ ఫౌండేషన్‌కు సహకరించాలని సూచించారు. సమీప రైతులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని, చెరువుల ఆధునికీకరణ, తద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాల న్నారు. స్థానిక పరిస్థితులు, ఆక్రమణలు, ఇతర అంశాలపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. మేహాద్రి గెడ్డ, గోస్తని నది తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆయా తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
రూ.కోటి అంచనాతో ప్రత్యేక ప్రణాళిక
జిల్లాలోని మొత్తం 14 చెరువులు, 17 జలధారలు, 16 కిలోమీటర్ల మేర సాగునీటి కాలువలు, 11 కొత్త స్లూయిజ్‌లు, మరో మూడు స్లూయిజ్‌లకు మరమ్మతులు చేపట్టేందుకు సుమారు రూ.కోటి అంచనాతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ధాన్ ఫౌండేషన్ ప్రతినిధి లోకేష్ తెలిపారు. రాంపురం, ఆటోనగర్, కొత్తపాలెం, కాపులుప్పాడ ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జేసీ కె.మయూర్ అశోక్, ఆర్డీవోలు శ్రీలేఖ, సంగీత్ మాధుర్, ఏడీసీ రమణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment