అద్దె చెల్లింపులకు ప్రత్యేక అప్లికేషన్
ప్రారంభించిన వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్
విశాఖ సిటీ: లీజుదారుల అద్దె చెల్లింపులను సులభతరం చేసేందుకు వీఎంఆర్డీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కోసం www. vmrdarental.com వెబ్ అప్లికేషన్‌ను రూపొందించారు. వీఎంఆర్డీఏ నుంచి లీజుకు తీసుకున్న షాపులు, వాణిజ్య సముదాయాలు, ఇలా అన్నింటికి సంబంధించిన అద్దెలను ఇకపై ఈ ప్రత్యేక అప్లికేషన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. హెచ్‌డీఎఫ్‌సీ వారు అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్‌ను వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం ప్రారంభించారు. దీంతో అద్దెదారులు తమ దుకాణాలకు సంబంధించిన నెలవారి అద్దెలను దీని ద్వారా సులభతరంగా చెల్లించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. తొలి దశలో కేవలం అద్దె చెల్లింపులకే అప్లికేషన్ అభివృద్ధి చేసినప్పటికీ దశల వారీగా ఇందులో ఇతర సేవలను నిక్షిప్తం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఆడిటోరియంల బుకింగ్‌లకు సంబంధించిన ఆప్షన్‌ను కూడా ఇందులో పొందుపరుస్తున్నారు. మరో వారం, 10 రోజుల్లో ఈ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా దశల వారీగా ఒక్కో సేవను దీని ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్, కార్యదర్శి రమేష్, ముఖ్య గణంకాధికారి హరిప్రసాద్, పరిపాలనాధికారి వెంకటేశ్వరరావు, హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment