వాల్తేరుకి
● కలెక్టర్ హరేందిర ప్రసాద్ ● కొమ్మాది శాప్ స్టేడియం పరిశీలన
క్రీడాభివృద్ధికి
మరిన్ని చర్యలు
మధురవాడ: జిల్లాలో క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. కొమ్మాదిలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను బుధవారం ఆయన సందర్శించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రీడా మైదానాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ ఇచ్చేలా అంతా కృషి చేయాలని కోచ్‌లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియంనకు సంబంధించి స్థలం వివరాలపై ఆరా తీశారు. స్టేడియంను పరిశీలించారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, డీఎస్‌డీవో జూన్ గ్యాలియెట్, శాప్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేష్, రూరల్ డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
అమెరికన్ వీసా కోసం
దళారులను నమ్మకండి
Comments
Please login to add a commentAdd a comment