విశాఖ సిద్ధం
డాక్‌యార్డుకు మారిషస్ కోస్ట్‌గార్డ్ నౌక
దేశవాళీ ధనాధన్ క్రికెట్‌కు
● 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ● విశాఖతో పాటు విజయనగరంలో మ్యాచ్‌లు ● విశాఖ చేరుకున్న టీ–20 జట్లు
విశాఖ స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పేరిట జరగనున్న దేశవాళీ టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల కోసం జట్లు బుధవారం విశాఖపట్నం చేరుకున్నాయి. మొత్తం 38 జట్లు ఐదు గ్రూపులుగా విడిపోయి తలపడనున్న ఈ టోర్నీలో గ్రూప్ డీ మ్యాచ్‌లు విశాఖపట్నం, విజయనగరం వేదికగా జరగనున్నాయి. డీ, ఈ గ్రూప్‌ల్లో ఏడేసి జట్లు.. ఏ, బీ, సీ గ్రూప్‌ల్లో ఎనిమిదేసి జట్లు గ్రూప్ స్టేజ్‌లో పోటీపడనున్నాయి. పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రోజూ రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఉదయం 11 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 4.30 గంటలకు రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. విజయనగరంలోని పి.వి.జి.రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గ్రూప్ డీలో అసోం, రైల్వేస్, చండీగఢ్, పుదుచ్చేరి, విదర్భ, ఒడిశా, చత్తీస్‌గఢ్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ స్టేజ్ పోటీలు ఈ నెల 23 నుంచి ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తాయి. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు డిసెంబర్ 9 నుంచి ప్రీ–క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్‌లో పోటీపడతాయి. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 15న జరుగుతుంది. ఈ సందర్భంగా ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్‌బాబు మాట్లాడుతూ గ్రూప్ డీలో తలపడే అన్ని జట్లకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇక ఆంధ్రా జట్టు గ్రూప్ ‘ఈ’లో హైదరాబాద్ వేదికగా ఆడనుంది. 25న నాగాలాండ్, 27న గోవా, 29న మహారాష్ట్ర, డిసెంబర్ 1న సర్వీసెస్, 3న కేరళ, 5న ముంబయి జట్లతో ఆంధ్రా జట్టు తలపడనుంది.
విశాఖ సిటీ: మారిషస్ కోస్ట్‌గార్డు నౌక ఎంసీజీఎస్ వాలియంట్ విశాఖ నేవల్ డాక్‌యార్డుకు వచ్చింది. ఈ సందర్భంగా నేవీ అధికారులు మారిషస్ అధికారులు, సిబ్బందికి స్వాగతం పలికారు. సాగర్ కార్యక్రమంలో భాగంగా మారిషస్ నౌకకు ఇక్కడ మూడున్నర నెలల పాటు మరమ్మతులు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment