వాతావరణ మార్పులపై ప్రత్యేక కార్యాచరణ
కొమ్మాది: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వచ్చే యువతలో భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారని, అయితే వీసా కోసం దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం కాన్సులర్ ఇన్ఫర్మేషన్ యూనిట్ విభాగాధిపతి ఎస్.జెన్నె సూచించారు. గీతం డీమ్డ్ వర్సిటీలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికాలో ఉన్నత చదువులకు వీసా పొందే విధానంపై ఆమె అవగాహన కల్పించారు. అమెరికాలో 4,500 గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయని, వీటిలో ప్రవేశానికి ఆసక్తి గలవారు తమ కాన్సులేట్ కార్యాలయంలో ఎఫ్–1 విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో వీసా పొందాలనుకుంటే భవిష్యత్తులో అమెరికాలో ప్రవేశానికి శాశ్వతంగా మార్గాలు మూసుకుపోయినట్లేనని హెచ్చరించారు.
● మేయర్ గొలగాని హరివెంకటకుమారి
డాబాగార్డెన్స్: ప్రపంచ వ్యాప్తంగా నగరాల్లో గణనీయంగా వాతావరణం మార్పులు చెంది ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. విశాఖ నగరంలో వాతావరణం మార్పులకు అనుగుణంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో ఐసీఎల్‌ఈఐ ఆర్గనైజేషన్ క్లైమేట్ యాక్షన్‌పై సిటీస్ ప్లానింగ్, ఆచరణ అనే అంశంపై మంగళవారం వర్క్‌షాపు జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు. నగరం ఇప్పటికే పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంలో ముందంజలో ఉందన్నారు. జీవీఎంసీ 13 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, బీచ్‌రోడ్డులో 3 వేల సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసిందన్నారు. విశాఖలో 28 శాతం గ్రీన్ కవర్ ఉందని, మరింత పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పా రు. బీచ్‌రోడ్డులో ప్రజా రవాణా కోసం ఉచితంగా ఈ–ఆటోలు నడుపుతున్నామని, ఇంటింటా చెత్త సేకరణకు 65 ఈ–ఆటోలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విశాఖ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్‌ను జీవీఎంసీ ఎస్‌ఆర్‌యూ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. అర్బన్‌లో కార్బన్ మొబిలిటీ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ ఫర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టుపై అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మియా వాకీ అర్బన్ ఫారెస్ట్‌పై ఉదయపూర్ మున్సిపల్ కార్పొరేషన్, క్లైమేట్ యాక్షన్ ఎర్లీ వార్నింగ్ సిస్టం ఫర్ అర్బన్ ప్లడింగ్ ప్రాజెక్టుపై తమిళనాడు తిరునల్వేలి ప్రతినిధులు మాట్లాడారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, ప్రధాన ఇంజినీర్ పి.శివప్రసాద్‌రాజు, ఐసీఎల్‌ఈఐ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఈమని కుమార్, ప్రొఫెసర్ ఎస్.రామకృష్ణారావు, విజయవాడ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్‌బాబు పలు అంశాలను చర్చించారు. విజయవాడ అదనపు కమిషనర్ చంద్రశేఖరరావు, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ వారా రవీంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment