No Headline
డీఆర్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత అజెండాపైనే దృష్టి సారించిన సౌరభ్‌కుమార్ విశాఖ రైల్వేస్టేషన్, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. ఆయన హయాంలో వచ్చిన కొత్త రైళ్లన్నీ గతంలో ప్రతిపాదన చేసినవే.. ఆయన మార్కు అంటూ ఎక్కడా చూపించలేకపోయారు. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల విషయంలోనూ డీఆర్‌ఎం తన హస్తలాఘవాన్ని చూపించినట్లు ఆరోపణలున్నాయి. సుమారు రూ.390 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన మొదలైన పనులు చేపట్టాల్సి ఉన్నా.. భారీగానే ముడుపులు ఇవ్వాలంటూ కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే దువ్వాడ లాంటి స్టేషన్‌లో దాదాపు 50 శాతం పనులు పూర్తయినా.. వైజాగ్ రైల్వేస్టేషన్‌లో మాత్రం 10 శాతం కూడా పూర్తి కాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన ఉద్యోగుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 16 నెలల పాటు డీఆర్‌ఎంగా వెలగబెట్టిన సౌరభ్‌కుమార్.. వాల్తేరు పరువును దిగజార్చేశారు. అథఃపాతాళానికి పడిపోయిన డివిజన్‌కు కొత్త డీఆర్‌ఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రైల్వే బోర్డు పలువురు అధికారులను సంప్రదించగా.. విముఖత చూపినట్లు సమాచారం. కాగా.. గత అనూప్ సత్పతిని మళ్లీ డీఆర్‌ఎంగా నియమించాలని సోషల్ మీడియా ద్వారా పలువురు రైల్వే మంత్రికి, బోర్డుకు వినతులు పంపిస్తున్నారు.
డివిజన్ అభివృద్ధి ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment