నేటి నుంచే ధనాధన్ క్రికెట్
విశాఖ స్పోర్ట్స్: దేశవాళీ ధనాధన్ టీ–20 క్రికెట్ శనివారం నుంచి ప్రారంభంకానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ(ఎస్‌ఎంఏ) టోర్నీలో భాగంగా గ్రూప్ డీ మ్యాచ్‌లకు వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం ఆతి థ్యమివ్వనుంది. ఇప్పటికే గ్రూప్‌లో తలపడుతున్న ఏడు జట్లలో ఆరు జట్లు స్టేడియం బీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసుకున్నాయి. శుక్రవారం ఉదయం సెషన్‌లో అసోం, రైల్వేస్ జట్లు, మధ్యాహ్నం సెషన్‌లో చండీగఢ్, పుదుచ్చేరి జట్లు నెట్స్‌లో శ్రమించాయి. సాయంత్రం సెషన్‌లో విదర్భ, ఒడిశా జట్లు ప్రాక్టీస్ చేశాయి. చత్తీస్‌గఢ్ జట్టు శనివారం వైఎస్సార్ స్టేడియం బీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయనుంది. టోర్నీ లో భాగంగా శనివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రోజు విడిచి రోజు విశాఖలో రెండు మ్యాచ్ లు, విజయనగరంలో ఒక మ్యాచ్ జరగనుంది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. మరో మ్యాచ్ సాయంత్రం నాలుగున్నర గంటలకు డే నైట్‌గా జరగనుంది. ప్రస్తుత సీజన్‌లో విశాఖ వేదికగా ఆడుతున్న జట్లలో గతేడాది ఆయా గ్రూప్‌ల్లో విదర్భ టాపర్‌గా నిలవగా అసోం ద్వితీయ స్థానంలో నిలిచింది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అసోం ఆటగాడు రియాన్ పరాగ్ అత్యధిక స్కోర్‌తో టాపర్‌గా నిలిచాడు. ఈ సారి అసోం జట్టుకు దినేష్ దాస్, విదర్భకు కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ, రైల్వేస్‌కు ఉపేంద్ర, పుదుచ్చేరికి దామోదర్, ఒడిశాకు గోవింద, చండీగఢ్‌కు మనన్ వోహ్రా, చత్తీస్‌గఢ్ జట్టుకు అమన్‌దీప్ నాయకత్వం వహిస్తున్నారు.
హైదరాబాద్ వేదికగా తలపడనున్న ఆంధ్రా జట్టు
ఈ ట్రోఫీలో ఆంధ్రా జట్టు గ్రూప్ ఈలో హైదరాబాద్ వేదికగా ఆడనుంది. జట్టుకు రికీబుయ్ నాయకత్వం వహిస్తుండగా వైస్ కెప్టెన్‌గా రషీ ద్, వికెట్ల వెనుక భరత్ సహకరించనున్నాడు. అశ్విన్ హెబ్బర్, ప్రసాద్, వంశీకృష్ణ బ్యాటింగ్‌తోనూ శశికాంత్, అవినాష్, సత్యనారాయణ, స్టీఫెన్ చెలరేగే బంతులతో రాణించేందుకు సిద్ధమయ్యారు. యశ్వంత్, విజయ్, కుమార్ స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకోనున్నారు.
నేటి మ్యాచ్‌లు
వైఎస్సార్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు చండీగఢ్‌తో పుదుచ్చేరి, సాయంత్రం నాలుగున్నర గంటలకు విదర్భతో ఒడిశా తలపడనుంది. విజయనగరం పీవీజీ రాజు ఏసీఏ క్రికెట్ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటలకు అసోంతో రైల్వేస్ జట్టు పోటీపడనుంది.
వైఎస్సార్ స్టేడియంలో ఎస్‌ఎంఏ టోర్నీ
గ్రూప్ డీ మ్యాచ్‌లు ప్రారంభం
చండీగఢ్, పుదుచ్చేరి మధ్య తొలి మ్యాచ్
మ్యాచ్‌లను ఉచితంగానే వీక్షించండి
దేశవాళీ టీ–20 మ్యాచ్‌లను ఉచితంగానే స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఐపీఎల్, జాతీయ జట్లకు ఆడిన ఆటగాళ్లు ఎస్‌ఎంఏ టోర్నీలో పాల్గొంటున్నారు. విశాఖలో ఈ మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానులను గేట్ నంబర్ 15 నుంచి ప్రవేశం కల్పిస్తున్నాం. మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం.
– సతీష్, కార్యదర్శి, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్
Comments
Please login to add a commentAdd a comment