సోలార్ ఎనర్జీలో విశాఖను మోడల్‌గా తీర్చిదిద్దాలి
విశాఖ విద్య: పర్యావరణహితమైన సౌర విద్యుత్‌పై అందరూ అవగాహన పెంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు, రెన్యూవబుల్ ఎనర్జీ పార్లమెంట్ కమిటీ సభ్యుడు గొల్ల బాబురావు కోరారు. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘రీ–నెక్ట్స్’సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పోను శుక్రవారం ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాబూరావు మాట్లాడుతూ సోలార్ ఎనర్జీపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సోలార్ ఎనర్జీలో విశాఖను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇంటిపై సోలార్ వ్యవస్థ పెట్టుకునే వారి సంఖ్య నెలనెలా పెరుగుతోందని, ఈపీడీసీఎల్ పరిధిలో 4 లక్షల సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు హేమ కుమార్, జనరల్ సెక్రటరీ, రామ్మోహన్‌రావు, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు, నాగరాజు, జయబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంపీ గొల్ల బాబూరావు విజ్ఞప్తి
సౌర విద్యుత్‌పై ప్రజలు అవగాహనపెంచుకోవాలని పిలుపు
Comments
Please login to add a commentAdd a comment