కళా సేవకుడికి కన్నీటి వీడ్కోలు
సీతమ్మధార: తుది శ్వాస వరకు కళ కోసం తపించిన బాదంగీర్ సాయికి కళాకారులు కన్నీటి వీడ్కోలు పలికారు. కొంతకాలంగా బ్రెయిన్ హెమరేజ్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.. మురళీనగర్‌లోని ఆయన నివాసానికి సాయి భౌతికకాయం తీసుకురాగా.. శుక్రవారం కళాకారులు, కళాభిమానులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కళా ఆస్పత్రి ఎండీ డాక్టర్ పి.వి.రమణమూర్తి మాట్లాడుతూ బాదంగీర్ సాయి మృతి విశాఖ కళారంగానికి తీరనిలోటన్నారు. ఆధ్యాత్మిక వేత్త ఎం.వి.రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖలో నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి బాదంగీర్ సాయి అని, కళ కోసం డబ్బును, జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. ఏపీ మా అధ్యక్షుడు దాడి సత్యనారాయణ మాట్లాడుతూ బాదంగీర్ సాయి నాటక రంగానికి ఊపిరి పోశారని, తుది శ్వాస వరకు నాటక రంగం కోసం కష్టపడ్డారన్నారు. అనంతరం బాదంగీర్ సాయి అంతిమయాత్ర నిర్వహించి.. మర్రిపాలెం సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. క ళాకారులు, కళాభిమానులు, రచయితలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. అంతి మ యాత్రలో స్టార్‌మేకర్ సత్యానంద్, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి, సినిమా దర్శకుడు యాద్‌కుమార్, ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ చెన్నా తిరుమలరావు, ఎన్‌ఎన్‌ఆర్, చంద్రశేఖర్, శివజ్యోతి, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు నల్లబ్యాడ్జీలు ధరించారు.
ముగిసిన బాదంగీర్‌సాయి అంత్యక్రియలు
Comments
Please login to add a commentAdd a comment