పరిపాలనాదక్షుడు గురునాథరావు
అక్కిరెడ్డిపాలెం: మాజీమంత్రి గుడివాడ గురునాథరావు పరిపాలనాదక్షుడని ఆయన తనయుడు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురునాథరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం మింది హైస్కూల్ వద్ద గల ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డిలతో కలిసి అమర్నాథ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురునాథరావు మరణించి 23 ఏళ్లు గడిచినా.. ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మూడు ఫ్రీజర్ బాక్స్‌లను అక్కిరెడ్డిపాలెం, మింది, గుడివాడ అప్పన్నకాలనీలకు చెందిన శ్మశాన వాటికలకు అందజేశారు. వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబర్ గుడివాడ అప్పలరామ్మూర్తి, రాష్ట ప్రధాన కార్యదర్శి ఉరు కూటి అప్పారావు, కార్పొరేటర్లు ఇమ్రాన్, గుడివాడ అనూష, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ పల్లా చినతల్లి, నాయకులు గుడివాడ లతీష్, కోమటి శ్రీనివాసరావు, మంత్రి శంకర్‌నారాయణ, సిరట్ల శ్రీనివాస్, బోగాది సన్యాసిరావు, వరదాడ వెంకటరమణ, సండ్రాన నూకరాజు, గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment