పార్సిల్స్‌పై అప్రమత్తం అవసరం
పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి
విశాఖ సిటీ: నగరంలో ఉన్న పార్సిల్స్, కొరియర్, పలు ఈ–కామర్స్ సంస్థలకు వచ్చే పార్సిల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సీపీ శంఖబ్రత బాగ్చి సదరు సంస్థల ప్రతినిధులకు సూచించారు. విశాఖలో డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా నగరంలో ఉన్న పార్సిల్, కొరియర్, పలు ఈ–కామర్స్ సంస్థల ప్రతినిధులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కలిసి బుధవారం పోలీస్ సమావేశ మందిరంలో కో–ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. పార్సిల్స్, కొరియర్, ఈ–కామెర్స్ ద్వారా డ్రగ్స్ రవాణా అవుతున్న తీరును ఎన్‌సీబీ అధికారులు వివరించారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సచిన్ గొర్పడే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టి.జి.వెంకటేష్, నగర డీసీపీ–1 అజిత వేజెండ్ల, డీసీపీ–2 మేరీ ప్రశాంతి, డీసీపీ(క్రైం) లతామాధురి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment