తాటిచెట్లపాలెం: శీతాకాలం, మంచు కురిసే సమయంలో వాల్తేర్ డివిజన్ పరిధిలో రైళ్ల రాకపోకలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. ఈ సీజన్‌లో ముఖ్యంగా రాత్రి వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తుంది. దీని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు తగిన చర్యలు చేపట్టారు. లెవెల్ క్రాసింగ్‌లు, ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ మాస్ట్‌ల వద్ద అత్యంత ప్రకాశవంతమైన లూమినస్, ఫ్లోరోసెంట్ స్ట్రిప్స్‌ను అమర్చారు. ఇవి లోకో పైలట్‌లకు సహాయకారిగా ఉంటాయి. అలాగే అర్ధరాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో రైళ్ల వేగాన్ని గంటకు 60కి.మీ.కి పరిమితం చేసినట్లు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment