పరిశ్రమల్లో రక్షణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పరిశ్రమల్లో కార్మికుల రక్షణ, భద్రత ప్రమాణాలు, నిత్యం తనిఖీలు వంటివి వట్టి మాటలుగానే మిగిలాయి. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు, నాయకులు అనంతరం ఇటువైపు చూడడం లేదు. నెలకు కనీసం రెండు ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. పరవాడ జేఎన్ ఫార్మా సిటీలో గల ఠాగూర్ కంపెనీలో మంగళవారం రియాక్టర్–కమ్–రిసీవర్ ట్యాంక్ (జీఎల్‌ఆర్–325) నుంచి 400 లీటర్ల హెచ్‌సీఎల్ లిక్విడ్ లీక్ అయింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు జరగగా.. బుధవారం ఉదయం 6 గంటల తరువాత అధికారులు, యాజమాన్య ప్రతినిధులు స్పందించారు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి వుంటే తమ సహచరుడు మరణించి ఉండేవాడు కాదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా ఉన్నత అధికారులు కంపెనీ యాజనాన్యాలకు కొమ్ము కాస్తూ..కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment