ఎస్సీ వర్గీకరణపై 194 వినతులు
మహారాణిపేట: షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ సమాచారం పూర్తి స్థాయిలో అధికారుల వద్ద ఉండాలని షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు.బుధవారం కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌తో కలిసి షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై ప్రజలు, ఉద్యోగులు, వివిధ కుల సంఘ నాయకుల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించారు. మొత్తం 194 వినతులు వచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కలెక్టర్ జిల్లాలో ఉన్న కులాల వారీగా గణాంకాలు వివరించారు. విద్యాశాఖ, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ ఆఫీస్, వైద్య ఆరోగ్యశాఖ, డీఆర్డీఏ, ఏపీ ఈపీడీసీఎల్, ఆర్టీసీ, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖ, మార్కెటింగ్ శాఖ, గృహనిర్మాణ శాఖ కార్యాలయాల్లో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై సంబంధిత వివరాలను అధికారులు వివరించారు. సమావేశంలో డీఆర్వో భవానీశంకర్, ఆర్డీవో శ్రీలేఖ, వికలాంగుల సంక్షేమ సహాయ సంచాలకులు జె.మాధవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మతోపాటు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment