నిఘా ఏర్పాటు చేస్తాం
కొమ్మాది: ఖనిజాల కోసం రాత్రి పూట భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుక తరలింపుపై ‘తీరంలో ఇసుక తుపాను’శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆర్డీవో సంగీత్ మాధుర్ స్పందించారు. ఇసుక తవ్విన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులతో నిఘా ఏర్పాటు చేస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక్కడ ఇసుక తరలింపు వలన భారీ స్థాయిలో గోతులు ఏర్పడటం వాస్తవమేనని, ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో జరుగుతున్న గ్రావెల్ మాఫియాపై పలు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment