టెన్త్ మోడల్ టెస్ట్ పేపర్లు ఆవిష్కరణ
విశాఖ విద్య: యూటీఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన టెన్త్ మోడల్ టెస్ట్ పేపర్లను ఆ సంఘం నాయకులతో డీఈవో ప్రేమ్‌కుమార్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ నిష్ణాతులైన సీనియర్ ఉపాధ్యాయులచే 10వ తరగతి విద్యార్థుల కోసం మోడల్ పేపర్లను తయారు చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో అంబటి సోమేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్, జిల్లా కోశాధికారి కె.రాంబాబు, జిల్లా సీనియర్ నాయకులు బి.జనార్దనరావు, జిల్లా కార్యదర్శులు మహ్మద్ రిజ్వాన్, టి.జగన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment