కాంట్రాక్టరుతో కుమ్మక్కు..!
వీధి దీపాలు వెలగడం లేదన్న విమర్శల నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సదరు కాంట్రాక్టరుకు రెండు సార్లు నోటీసులను జారీచేశారు. మూడోసారి కూడా నోటీసు జారీచేసి కాంట్రాక్టును రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే ఎన్నికలు.. అనంతరం బదిలీతో ఈ ప్రక్రియ కాస్తా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో వీధి దీపాల వ్యవహారంపై కార్పొరేటర్ల నుంచి విమ్శలొచ్చాయి. దీనిపై లోతుగా అధ్యయనం చేసి.. సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశం జరిగి మూడు నెలలు దాటినప్పటికీ ఆ దిశగా కనీస చర్యలు లేవు. పైగా మూడో నోటీసు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వంలోని కీలక కార్పొరేటర్లు చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. సదరు కాంట్రాక్ట్‌ను రద్దు చేయకుండా ఉండేందుకుగాను భారీ మామూళ్లకు మాట్లాడినట్లు సమాచారం.
64వ వార్డు గొడ్డువానిపాలెం,
ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ రోడ్డులో..
Comments
Please login to add a commentAdd a comment