ఆత్మవిశ్వాసంతో ముందుకువెళ్లండి
● దేవుడు అండగా ఉంటాడు ● క్రిస్మస్ వేడుకల్లో కలెక్టర్ హరేందిర ప్రసాద్
బీచ్‌రోడ్డు : ఆత్మవిశ్వాసంతో ముందుకువెళితే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని..బైబిల్ కూడా అదే బోధిస్తోందని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరినాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ క్యాండిల్ వెలిగించి, కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా చేసుకునే ఏకై క పండగ క్రిస్మస్ అన్నారు. అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను మేల్కొలిపి వారిలో ఏసు ప్రభువు చైతన్యం కల్పించారని తెలిపారు. ముందుగా ప్రార్థనా కార్యక్రమాన్ని పాస్టర్ డానియల్ శ్యామ్, పాస్టర్ – సంజీవ కుమారి నిర్వహించారు. సెయింట్ లూక్స్ నర్సింగ్ కాలేజ్, సెయింట్ లూక్స్ మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ, విద్యార్థినులు ఏసు ప్రభువు ప్రార్థనా గీతాలను ఆలపించారు. రేవ రాబర్ట్ స్మిత్ పాస్టర్ తమ సందేశాన్ని అందించారు. ఎంపీ ఎం.శ్రీ భరత్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, టీడీపీ నేతలు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment