కూటమి కార్పొరేటర్ల నయా దందా..!
వార్డుల్లో వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నట్లు స్థానిక కార్పొరేటర్ నుంచి అంగీకార పత్రం ఉండాలంటూ తాజాగా అధికారులు మెలిక పెట్టారు. ఇదే అదనుగా సదరు కాంట్రాక్టర్ నుంచి వసూళ్లకు తెరలేపారు. తమ వార్డులో వీధి దీపాలు బాగున్నాయని సంతకం పెట్టాలంటే రూ.లక్ష చొప్పున ఇచ్చుకోవాల్సిందేనని షరతు విధించినట్టు తెలుస్తోంది. అసలు వీధి దీపాలు వెలుగుతున్నాయా? లేదా? అంశాన్ని కంట్రోల్ రూం నుంచి నేరుగా పరిశీలించే వీలుంది. అయినప్పటికీ కూటమి కార్పొరేటర్లకు మామూళ్లు వచ్చేలా చేసేందుకే ఈ కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చారన్న విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment