నేరాలకు అడ్డాగా.. చీకటి ప్రాంతాలు
నగరంలో వీధి దీపాల నిర్వహణకు 400 మంది సిబ్బందిని నియమించి, పర్యవేక్షించేందుకు కాంట్రాక్టర్ అంగీకరించారు. కానీ కేవలం 150 మందితోనే పని నడిపించేస్తుండడంతో రోజూ సుమారు 38 వేలకు పైగా వీధిదీపాలు వెలగడం లేదు. చీకటి పడితే చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చైన్ స్నాచింగ్‌లు, ఈవ్ టీజింగ్, గంజాయి, డ్రగ్స్ వినియోగం జరిగిపోతున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో కారు చీకట్లు కమ్మేయడంతో పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ఆటోలు, ఇతర వాహనాల బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయి. గంజాయి బ్యాచ్‌లు చీకటి రోడ్లపై తిష్టవేసి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. యువతులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment