సెల్ మోగదు రంగా.!
దూరమెంత ఉన్నా, దగ్గర చేసే సాధనంగా మారిన సెల్‌ఫోన్ ఉంటే.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మాట్లాడుకునే వెసులుబాటు వచ్చేసింది. అందుకే నగర ప్రజలు ఫోన్లతో కుస్తీ పడుతున్నారు. ఒక కాల్ చేసుకోవాలంటే దాదాపు 2 నుంచి 3 నిమిషాల సమయం వృథా చేయాల్సి వస్తోంది. జనాభా పెరగడంతో మొబైల్ వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. బిజీ బిజీగా జీవితాలు ఎలా మారిపోయాయో, మొబైల్ నెట్‌వర్క్‌లు కూడా అంతే బిజీ అయిపోయాయి. ఎవరికి కాల్ చేసినా పెద్ద శబ్దంతో బీప్ సౌండ్ 3 నుంచి 5 సెకన్ల పాటు వినిపిస్తోంది. ఆ తర్వాత అదృష్టం ఉంటే కాల్ కనెక్ట్ అవుతోంది, లేకపోతే డిస్‌కనెక్ట్ అవుతోంది. ఈ సమస్యతో నగరంలో దాదాపు 90 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది సిగ్నల్స్ కోసం మేడల మీదికి, రోడ్ల మీదికి వచ్చి మరీ కాల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది ఫోన్‌ను పదే పదే స్విచ్ ఆఫ్, రీస్టార్ట్ చేస్తూ ఈసారైనా కాల్ కలుస్తుందో లేదో అని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొన్నిసార్లు వింత శబ్దాలు రావడంతో ఫోన్ పేలిపోతుందేమోనని భయపడుతున్నారు. ఎవరికి కాల్ చేసినా ఇదే సమస్య పునరావృతం కావడంతో సెల్‌ఫోన్ రిపేర్ షాపులకు పరుగులు తీస్తున్నారు. గత కొద్ది రోజులుగా నగరంలో మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అయితే ఈ సమస్య వెనుక అసలు కారణం మరొకటి ఉందని టెలికాం సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment