ఆయన చంద్ర‘బాదుడు’
సాక్షి, విశాఖపట్నం: సంపద సృష్టిస్తానంటూ రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల పేరుతో పెను భారాన్ని మోపి.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. చంద్ర‘బాదుడు’అని మరోసారి నిరూపించుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. పోరుబాటలో భాగంగా ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, ప్రజలపై ఎలాంటి భారాన్ని మోపబోమని చంద్రబాబు హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ చార్జీల పేరుతో రూ.15 వేల కోట్లకు పైగా ప్రజలపై పెను భారం మోపారు. ఒకేసారి విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని విడతల వారీగా పెంచుతూ మార్చి నాటికి యూనిట్‌పై రూ.2 వరకు పెంచుతున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని అప్పు ల పాలు చేస్తున్నారంటూ ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్పిన కూటమి నేతలు.. ఇప్పుడు కేవలం ఆరు నెలల్లో వేల కోట్ల అప్పు చేశారు. ఈ డబ్బు ఏమయింది? ఒక్క రూపాయి అయినా పేదవాడికి ఇచ్చారా? అమరావతికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలి. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై త్వరలోనే ఆందోళన నిర్వహిస్తాం. అమరావతి తప్ప ఏమీ అవసరం లేదన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.’ అని అమర్‌నాథ్ మండిపడ్డారు. ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ కూటమి వైఫల్యాల్ని ఎండగడతామన్నారు. ‘మూడు సార్లు సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసినవన్నీ మోసాలే. చంద్రబాబు చెప్పిన మాట, చేసిన వాగ్దానం ఎప్పుడైనా నిలబెట్టుకున్నారా? ప్రజల్ని భ్రమల్లో పెట్టడమే అతనికి తెలిసిన విద్య. ఈ సారీ అదే బాటలో వెళ్తూ ప్రజలను అథోగతిపాల్జేస్తున్నారు. ఆరు నెలల్లో రూ.లక్ష కోట్లు అప్పు చేశారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై పార్లమెంట్‌లో నిలదీస్తాం. దేవుడి దయ వల్ల జమిలి ఎన్నికలు త్వరగా వచ్చి.. మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వర్ణయుగం రావాలని ప్రార్థిస్తున్నాం.’అని బాబూరావు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు వంగపండు ఉష, పేర్ల విజయ్ చంద్ర, పోతిన శ్రీను, పార్టీ ముఖ్య నాయుకులు శోభా హైమావతి, చొక్కాకుల వెంకటరావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, జహీర్ అహ్మద్, రొంగలి జగన్నాథం, పేడాడ రమణికుమారి, మాధవీ వర్మ, నడింపల్లి కృష్ణంరాజు, గండి రవి కుమార్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు స్వాతి దాస్, కెల్లా సునీత, అనిల్ కుమార్ రాజు, మువ్వల లక్ష్మి సురేష్, సాడి పద్మా రెడ్డి, బిపిన్ కుమార్ జైన్, ఆళ్ల శంకరరావు, రెయ్యి వెంకట రమణ, శశికళ, కో–ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, పార్టీ నాయకులు పోతిన హనుమంత్, రామన్న పాత్రుడు, మారుతీ ప్రసాద్, వానపల్లి ఈశ్వరరావు, పెండ్ర అప్పన్న, బోని శివ రామకృష్ణ , జీలకర్ర నాగేంద్ర, మల్లేశ్వరి, దేవర కొండ మార్కేండేయులు, తుళ్లి చంద్రశేఖర్, బెందాళం పద్మావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment