మాజీ ప్రధానికి స్థాయీ సంఘం నివాళి
డాబాగార్డెన్స్: భారత దేశ ఆర్థిక సంస్కర్త, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ మరణం దేశానికి తీరని లోటని మేయర్, స్థాయీ సంఘ చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల స్థాయీ సంఘ సభ్యులతో కలసి మేయర్ సంతాపం తెలిపారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్‌సింగ్ కీలకపాత్ర పోషించారని మేయర్ కొనియాడారు. అనంతరం జరిగిన చర్చలో జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో 45 అంశాలు పొందుపరచగా.. మూడు అంశాలను వాయిదా వేసినట్లు మేయర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment