నేపాల్‌తో ఆంధ్ర పర్యాటక ఒప్పందం
డాబాగార్డెన్స్: పర్యాటక అభివృద్ధికి నేపాల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. భారత్‌లోని నేపాల్ అంబాసిడర్ డాక్టర్ సురేంద్ర తాపాతో పాటు బృంద సభ్యుడు తారానాథ్ అధికారి, ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ టూరిజం ఫోరం అధ్యక్షుడు కన్నెగంటి విజయమోహన్, టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దేశంలో ఇలాంటి ఒప్పందం ఆంధ్రప్రదేశ్ తప్ప మరే రాష్ట్రానికి జరగలేదని ఆయా విభాగాల ప్రతినిధులు తెలిపారు. పర్యాటక రంగంలోని కొత్త అంశాలు, మార్కెట్, పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఏపీ, నేపాల్ పరస్పర సహకారాన్ని ఈ ఒప్పందం ద్వారా అందిపుచ్చుకుంటాయన్నారు. విశాఖలో త్వరలో నేపాల్ కాన్సులేట్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో దసపల్లా హోటల్స్ గ్రూప్ చైర్మన్ రాఘవేంద్రరావు, గుజరాత్ టూరిజం ఆఫీసర్ అజిత్‌కుమార్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎంవీ పవన్ కార్తీక్, ఏపీ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి నరేష్‌కుమార్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు సాంబశివరావు, ధీరజ్‌కుమార్, శ్రీనివాస్‌కుమార్, రేస్ ఈవెంట్ అధినేత డి రవికుమార్, పలువురు ట్రావెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
విశాఖలో త్వరలోనే
నేపాల్ కాన్సులేట్ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment