సమర్థవంతమైన పోలీసింగ్‌కు సహాయ సహకారాలు
విశాఖ సిటీ: విశాఖలో సమర్థవంతమైన పోలీసింగ్‌కు అవసరమైన సహాయ సహకారాలను అన్ని శాఖల నుంచి అందిస్తామని ఆయా శాఖల అధికారులు తెలిపారు. రెవెన్యూ, న్యాయ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, నేవీ, ఇతర శాఖలతో కలిసి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శనివారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలీసు అధికారులు మరింత సమర్థవంతంగా పోలీసింగ్ చేయడానికి అవసరమైన విధానాలను సీపీతో పాటు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎ.గిరిధర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు తెలియజేశారు. ఆయా శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఈ సమావేశంలో ఈ ఏడాది కాలంలో నగరంలో లా–ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్‌లపై ఆయా అధికారులతో సమీక్షించారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలతో మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వారి స్టేషన్ పరిధిలో చేసిన ఉత్తమ పోలీసింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సంవత్సరంలో చేయాల్సిన, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment