తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ విశాఖపట్నంలో శనివారం సుడిగాలి పర్యటన చేశారు. విశాఖపట్నం, దువ్వాడ రైల్వే స్టేషన్లలో వాల్తేరు ఇన్‌చార్జ్ డీఆర్‌ఎం మనోజ్‌కుమార్ సాహు, ఇతర అధికారులతో కలిసి రైల్వే సౌకర్యాలను సమగ్రంగా తనిఖీ చేశారు. ముందుగా.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. డీఆర్‌ఎం కాన్ఫరెన్స్ హాల్‌లో వాల్తేరు అధికారులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. జ్ఞానాపురం వైపు జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. గతిశక్తి ప్రాజెక్టుల అమలుపై అనుసరిస్తున్న వ్యూహాలపైనా సంబంధిత అధికారులతో జీఎం చర్చించారు. అనంతరం.. దువ్వాడ రైల్వే స్టేషన్‌కు చేరుకొని జనరల్ మేనేజర్ వెయిటింగ్ హాళ్లు, రైల్వే కార్యాలయాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వాటర్ అవుట్‌లెట్లుతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పనులను పరిశీలించారు. విశాఖపట్నం–గోపాలపట్నం, సింహాచలం నార్త్–దువ్వాడ, గేట్ జంక్షన్–వడ్లపూడి మధ్య మూడు, నాలుగో లైన్ పనుల పురోగతిని కూడా జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment