దేశం గొప్ప నేతను కోల్పోయింది
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని.. ఆయన మరణం దేశానికి తీరని లోటని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నా రు. లాసన్స్‌బేకాలనీలోని తన కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్మోహన్‌సింగ్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని బొత్స కొనియాడారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభా రవిబాబు, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, శోభా హైమావతి, సమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పేడాడ రమణి కుమారి, చిన్న దాస్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్, కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, కెల్లా సునీత సత్యనారాయణ, లావణ్య నాగరాజు, బిపిన్ కుమార్ జైన్, చెన్నా జానకీరామ్, కోడి గుడ్ల పూర్ణిమ, అల్లు శంకరరావు, బర్కత్ అలీ, పీవీ సురేష్, నాయకులు షరీఫ్, బోని శివరామకృష్ణ, అల్లంపల్లి రాజబాబు, రామన్న పాత్రుడు, మారుతీ ప్రసాద్, తుళ్లి చంద్ర శేఖర్, వానపల్లి ఈశ్వరరావు, పెండ్ర అప్పన్న, జీలకర్ర నాగేంద్ర, మల్లేశ్వరి, దేవర కొండ మార్కేండేయులు, బి.పద్మావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment