షాక్!
మలేరియా కార్మికులకు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం సీజనల్ యాంటీ లార్వా ఆపరేషన్ వర్కర్లకు (మలేరియా కార్మికులు) షాక్ ఇచ్చింది. జీవీఎంసీ మలేరియా విభాగంలో పనిచేస్తున్న 431 మందిని జనవరి 1వ తేదీ నుంచి పనిలోకి రావద్దంటూ ఆదేశాలు జారీచేసింది. రోజువారీ వేతనం ఆధారంగా పనిచేస్తున్న వీరిని తొలగిస్తూ ఆదేశాలు జారీకావడంతో.. వారంతా ఘోల్లుమంటున్నారు. కొత్త సంవత్సరంలో తమ పొట్టకొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం 431 మంది సీజనల్ యాంటీ లార్వా ఆపరేషన్ వర్కర్లను 2023 సెప్టెంబర్‌లో పనిలోకి తీసుకుంది. ఇందులో 25 మంది కేజీహెచ్, విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అప్పటి నుంచి వీరు విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో దోమల బెడద తీవ్రంగా ఉంది. మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి సేవలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. సీజన్ ముగిసినందున వీరి అవసరం లేదని పేర్కొంటూ తొలగిస్తున్నట్టు జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంహెచ్‌వో) ఆదేశాలు జారీ చేశారు.
కొత్త సంవత్సరం రోజు తొలగింపు
రోడ్డున పడ్డ 431 మంది కార్మికులు
తమ పొట్టకొట్టారంటూ ఆందోళన
పనిలోకి తీసుకోవద్దు..!
తుపాన్‌ల వల్ల మొన్నటివరకు వర్షాలు విరివిగా కురవడంతో ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండిపోయింది. ఇక్కడ యాంటీ లార్వా ఆపరేషన్లను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నగరంలో ఇప్పటికీ దోమల బెడద తీవ్రంగా ఉంది. వీటిని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు ఫాగింగ్ ప్రకియ చేపట్టాలి. అయితే ఇది సరిగ్గా జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో సీజనల్ యాంటీ లార్వా ఆపరేషన్ వర్కర్ల అవసరం ఎంతైనా ఉంది. కానీ భారం పేరుతో కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే వీధుల్లోకి తీసుకోవద్దంటూ జోనల్ మలేరియా అధికారులకు జీవీఎంసీ ఆదేశాలు జారీచేయడంతో వారంతో గగ్గోలు పెడుతున్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఉన్న ఉపాధిని తీసేస్తోందని మండిపడుతున్నారు.
జోన్ల వారీగా వివరాలు
జోన్ వార్డులు సిబ్బంది
జోన్–1 4 18
జోన్–2 9 79
జోన్–3 14 45
జోన్–4 12 25
జోన్–5 24 63
జోన్–6 20 98
జోన్–7 5 25
జోన్–8 10 53
మొత్తం 98 406
కేజీహెచ్, విక్టోరియా
గవర్నమెంట్ హాస్పిటల్లో
మరో 25 మంది
పనిచేస్తున్నారు.
అర్ధాంతరంగా ఆపేస్తే ఎలా?
మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణ చర్యల అమలుకు సీజనల్ యాంటీ లార్వా ఆపరేషన్ వర్కర్లను తీసుకున్నారు. ఇప్పుడు అర్థాంతరంగా ఆపేస్తే ఎలా? నగర ప్రజలకు దోమలు కుట్టవా? జబ్బులు, జ్వరాలు రావా.? ఈ విషయమే బయాలజిస్ట్‌ని కలిసి చెప్పా. అందుకు బయాలజిస్ట్ స్పందిస్తూ త్వరలోనే తీసుకునే ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు.
– పి.వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షుడు,
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్
కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్
Comments
Please login to add a commentAdd a comment