5 వేల మందితో భారీ భద్రత
ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. కేంద్ర బలగాలు నగరానికి చేరుకొని ఏయూ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిషేధించారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలు రోడ్ షో, బహిరంగ సభ ప్రదేశాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. డ్రోన్ కెమెరాల వినియోగాన్ని నిషేధించారు. మోదీ సభకు భారీగా జనసమీకరణ చేపడుతున్నందున.. 5 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. 32 మంది ఐపీఎస్ అధికారులను నగరానికి రప్పించారు. అలాగే 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్‌ఐలతో పాటు ఏఆర్, ఇతర సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు బస్సులు, ఆటోల్లో సభకు వస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాధారణ వాహనాల మళ్లింపులపై పలు సూచనలు చేశారు. డీజీపీ ద్వారకా తిరుమల, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment