రోడ్ షోతో పాటు బహిరంగ సభ
ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో సాయంత్రం 4.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 4.45 గంటలకు సిరిపురం ప్రాంతంలోని వెంకటాద్రి వంటిల్లు ప్రాంతానికి వస్తారు. అక్కడి నుంచి జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఆ రోడ్డులో ఎడమ వైపు వీవీఐపీలకు, కుడివైపు ప్రజలకు కేటాయించారు. ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం రైల్వే జోన్, బల్క్ డ్రగ్ పార్క్.. ఇలా రూ.2 లక్షలు విలువైన కీలక ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన వెంటనే రోడ్డు మార్గంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు 6.55 గంటలకు చేరుకుంటారు. సాయంత్రం 7 గంటలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో భువనేశ్వర్‌కు పయనమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment