భారీగా జన సమీకరణ
ప్రధాని సభను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే ఏయూ మైదానంలో జరిగిన ప్రధాని సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనాలు తరలివచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ సభపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రులు ఇప్పటికే నాలుగు రోజులుగా జిల్లాలో మకాం వేసి భారీ జన సమీకరణ చేపట్టాలని కూటమి నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం విశాఖ నుంచే కాకుండా విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలను తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఆటోలను సిద్ధం చేశారు. శ్రీకాకుళం నుంచి 200 బస్సులు, విజయనగరం, పార్వతీపురం నుంచి 400 బస్సుల్లోనే కాకుండా ఉమ్మడి విశాఖ, ఇలా అన్ని ప్రాంతాల నుంచి 2,280 బస్సులు, 2,280 ఆటోలు, 382 మినీ బస్సులు, 150 టాటా మ్యాజిక్‌లలో జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment