అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాల బౌద్ధ సంఘాల ఆధ్వర్యంలో కొండ దిగువన బౌద్ధ మేళా నిర్వహించారు. అనంతరం బౌద్ధ పతాకంతో కొండపై గల ప్రధాన స్థూపం వరకు శాంతి ఊరేగింపు చేపట్టారు. బుద్ధుడి గుహలో ప్రధాన స్థూపం వద్ద పుష్పాంజలి, బుద్ధ వందనం, దమ్మదీక్షని నాగపూర్‌కు చెందిన బౌద్ధవులు వెనరబుల్ డాక్టర్ జ్ఞాన్‌ధీప్ మహోథేరో, బోద్గరత్న మహోథేరోలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించేతత్వం ఉన్న బౌద్ధ మతాన్ని విదేశాల్లో ఎక్కువ ఆదరిస్తున్నారన్నారు. బౌద్ధ సంఘాల అధ్యక్షుడు డాక్టర్ మాటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బొజ్జన్నకొండను, విశాఖలో తొట్లకొండను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం భూమి మాసపత్రిక, క్యాలెండర్‌ను శ్రీనివాస్ ఆవిష్కరించారు. అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ విశాఖ అధ్యక్షుడు బొడ్డు కల్యాణరావు, వివిధ సంఘాల నాయకులు బోర వేణుగోపాల్ గౌతమ్, గొంది నవీన్, కర్రి సత్యనారాయణ, థమ్మాచారి రావూరి విజయకుమార్, బల్లా నాగభూషణం, బోర లోకేశ్వరరావు బోధి, జెవి.ఝాన్సీలక్ష్మి, పల్లా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment