ఈ అనధికార అక్రమ మైనింగ్ వ్యవహారంలో కూటమి నేతలతో పాటు అధికారులకు కూడా ప్రతి నెలా వాటాలు అందుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక లోడుతో వెళుతున్న వాహనాలను చూసీ చూడనట్టుగా ఉండేందుకు వీలుగా రవాణాశాఖ అధికారులకు ప్రతి నెలా మామూళ్లు ముట్టచెబుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక అనధికారిక క్వారీల్లో జరుగుతున్న మైనింగ్‌ను పట్టించుకోకుండా ఉండేందుకుగానూ మైనింగ్ అధికారులకూ భారీగా ముడుతోందన్న విమర్శలున్నాయి. అక్రమ మైనింగ్‌తో పాటు అధిక లోడుతో భారీగా రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. అయినప్పటికీ వీరికి చీమ కుట్టినట్టు కూడా ఉండటం లేదు. ఇక మైనింగ్ విజిలెన్స్ అధికారులు కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా దాడులు చేసి అక్రమ మైనింగ్‌ను నిలిపివేసేందుకు గత 7 నెలల కాలంలో ప్రయత్నించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు స్థానిక పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ ఇలా అన్ని విభాగాల అధికారులకు వాటాల లెక్కన పంచుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ కూటమి నేత బంధువు దగ్గరుండీ మరీ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వాటా వారికి ఇచ్చిన తర్వాత మిగిలిన భారీ మొత్తాన్ని సదరు కూటమి నేత బంధువు జేబులోకి వెళుతోంది.
ఏకంగా కొత్త టిప్పర్లు!
Comments
Please login to add a commentAdd a comment