డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం ఈ నెల 24న నిర్వహించనున్నారు. నగర మేయర్, స్థాయీ సంఘ చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల స్థాయీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమావేశంలో 110 అజెండా అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. వీటిలో ప్రధానంగా పలు వార్డుల్లో అభివృద్ధి పనులు, సర్వీస్ అంశాలు, ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల పనికాలం పొడిగింపు తదితర అంశాలు పొందుపరిచారు.
29న అప్పన్న తెప్పోత్సవం
సింహాచలం : పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకుని ఈనెల 29న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. కొండ దిగువ వరాహ పుష్కరిణిలో సాయంత్రం 5 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమానికి భార్తీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆరోజు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపై స్వామివారి మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయని తెలిపారు.
రిసోర్స్ పర్సన్ పోస్టులకు దరఖాస్తులు
ఎంవీపీ కాలనీ: డీఆర్‌డీఏ, ఉపాధి కల్పన, వ్యవ స్థాపక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలో రిసోర్స్ పర్సన్‌గా సేవ లు అందించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖా స్తు చేసుకోవచ్చని స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిగ్రీ, కంప్యూటర్ నైపుణ్యం కలిగి, నవంబర్ 1, 2024 నాటికి 21 ఏళ్లు నిండి, 30 ఏళ్ల లోపు వయసున్నవారు అర్హులు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు మండల సమాఖ్య వెలుగు కార్యాలయానికి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ లింక్ ద్వారా ఈ నెల 24లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment