No Headline
ఈ వ్యవహారాలు సజావుగా సాగడంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.... గత కొద్దిరోజులుగా కొత్త టిప్పర్లు ఈ మైనింగ్ క్వారీల నుంచి రాంబిల్లి వరకూ హోరెత్తిస్తున్నాయి. కేవలం ఈ బండరాళ్లను సరఫరా చేసేందుకే కొత్తగా సీఎం రమేష్‌తో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులు 100 వరకూ కొత్త టిప్పర్లను కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బండరాళ్లను తీసుకెళుతున్న పలు ఇతర సంస్థలకు చెందిన భారీ టిప్పర్లలో కొన్నింటికి నెంబరు ప్లేట్లు కూడా లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ రవాణాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక ఇష్టారాజ్యంగా మైనింగ్ చేపడుతూ.... ఓపెన్ బ్లాస్టింగ్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఇంత జరుగుతున్నప్పటికీ అటవీ, పర్యావరణశాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం వెనుక కూటమి నేతల బలమైన ఒత్తిళ్లే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment