5న ‘వైఎస్సార్ సీపీ ఫీజు పోరు’
పోస్టర్ ఆవిష్కరించిన గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ‘వైఎస్సార్ సీపీ ఫీజు పోరు’ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌తో కలిసి ‘వైఎస్సార్ సీపీ ఫీజు పోరు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,800 కోట్ల విద్యా దీవెన, రూ.1,100 వసతి దీవెన బకాయిలు ఉన్నాయని తెలిపారు. గడిచిన ఎనిమిది నెలలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని, ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులపై ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థులు మానసికంగా ఆవేదన చెందుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేలా వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న ఫీజు పోరును విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేంతవరకు వైఎస్సార్ సీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తి రెడ్డి, తైనాల విజయ్‌కుమార్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయచందర్, జిల్లా అనుబంధ విభాగల అధ్యక్షులు బోని శివరామకృష్ణ, పేడాడ రమణికుమారి, దొడ్డి కిరణ్, సనపల రవీంద్ర భరత్, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, పులగమ కొండారెడ్డి, కార్పొరేటర్లు పీవీ సురేష్, ఇమ్రాన్, జానకీరాం, బిపిన్ జైన్, ముఖ్యనాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్, అల్లంపల్లి రాజుబాబు, బయ్యవరపు రాధ, మహ్మద్ షరీఫ్, ద్రోణంరాజు శ్రీ వత్సవ్, పి.వి నారాయణ, గణేష్ గౌడ్, మల్లేశ్వరి, దేవరకొండ మార్కండేయులు, జగపల్లి నరేష్, రాము బంగారు భవానీశంకర్, పులగమ శ్రీనివాస్ రెడ్డి, పులగమ సూర్యనారాయణ రెడ్డి, పీతల వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment