కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ
తాటిచెట్లపాలెం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సీపీఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం అంకెల గారడీ అని, రాష్ట్రానికి మరోసారి ‘గుండు సున్నా’ చూపించారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా శనివారం రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ శ్రేణులు ధర్నా చేశాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ ప్రధాని విశాఖ పర్యటనలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేశారని, ఇటీవల జోనల్ కార్యాలయం కోసం శంకుస్థాపన కూడా చేశారన్నారు. కానీ, బడ్జెట్‌లో దీనికి ఎలాంటి కేటాయింపులు లేవని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన సమయంలో చేసిన వాగ్దానాల అమలుకు నిధులు కేటాయించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని, దీనిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని గానీ, సెయిల్‌లో విలీనం చేస్తామని గానీ ప్రకటన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం కార్పొరేట్లకు మేలు చేసే బడ్జెట్ అని అన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు కేంద్రాన్ని ప్రశ్నించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆందోళనలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, ఎస్‌కే రెహమాన్, పి.చంద్రశేఖర్, ఎం. మన్మథరావు, ఆర్.శ్రీనివాసరావు, నాయకులు జి. కాసులు రెడ్డి, బి. పుష్ప, కె.రాధ, ఎ.దేవుడమ్మ, ఎ.ఆదినారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment