నేరాలను ఉపేక్షించం..
అల్లిపురం : నగరంలో క్రైమ్ రేటు పెరిగితే ఉపేక్షించేది లేదని, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశించారు. ఆదివారం ఆయన నగర పోలీస్ కమిషనరేట్‌లో గల నూతన సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో రౌడీయిజానికి తావులేకుండా చూడాలన్నారు. పోలీసింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అలాగే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు లా అండ్ ఆర్డర్, క్రైం, ట్రాఫిక్ విభాగాల పరితీరుపై పీపీటీ ద్వారా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వివరించారు. అనంతరం డీజీపీ పోలీస్ అధికారుల నుంచి అర్జీలను స్వీకరించారు. త్వరలోనే అర్జీలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ డీసీపీ–1 అండ్ 2, అడ్మిన్ డీసీపీ, క్రైం డీసీపీ, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం
డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
Comments
Please login to add a commentAdd a comment