![రామ్మ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/08vsc21c-606377_mr-1739128680-0.jpg.webp?itok=022k-ppw)
రామ్మోహన్‌నాయుడు కొత్త ఎత్తులు
వాల్తేరు డివిజన్‌ను ఇవ్వకపోతే ఉద్యమిస్తామని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబుతో సహా కూటమి నేతలు బీరాలు పలికారు. కేంద్రంలోని బీజేపీని చీల్చిచెండాడతామని హెచ్చరించారు. వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయకూడదని దీక్షల పేరుతో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు హడావుడి చేశారు. ఇప్పుడు వాల్తేరు డివిజన్‌ను విడదీయడంతో పాటు కీలకమైన కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌కు లేకుండా చేస్తే, జోన్, కొత్త డివిజన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేయడంపై ఉత్తరాంధ్ర వాసులు మండిపడుతున్నారు. అలాగే విశాఖ నుంచి నడిచే రైళ్లను శ్రీకాకుళం, పలాస వరకు పొడిగించాలని ప్రతిపాదనలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముందుగా విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తున్న గరీబ్‌రథ్‌ను శ్రీకాకుళం వరకు పొడిగించాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇది పూర్తయ్యాక గోదావరి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వంటి మరిన్ని రైళ్లను పలాస లేదా శ్రీకాకుళం వరకు పొడిగించేందుకు ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే కేకే లైన్ పోయినా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో వాల్తేరు కోసం రామ్మోహన్
నాయుడు ట్వీట్లు
![రామ్మోహన్‌నాయుడు కొత్త ఎత్తులు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/08vsc21b-606377_mr-1739128681-1.jpg)
రామ్మోహన్‌నాయుడు కొత్త ఎత్తులు
Comments
Please login to add a commentAdd a comment