![జాతీయ క్రీడల్లో మెరిసిన జ్యోతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/jyothi_mr-1739128680-0.jpg.webp?itok=7wrS3cwG)
జాతీయ క్రీడల్లో మెరిసిన జ్యోతి
విశాఖ స్పోర్ట్స్: 38వ జాతీయ క్రీడల్లో ఫాస్టెస్ట్ హార్డిలర్‌గా జ్యోతి యర్రాజీ నిలిచింది. వంద మీటర్ల హార్డిల్స్‌ను 13.10 సెకన్లలో పూర్తి చేసి జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించింది. జాతీయ రికార్డు 12.78 సెకన్లతో పాటు గేమ్ రికార్డు 13.22 సెకన్లు జ్యోతి పేరిటే ఉండగా.. ఈసారి తన గేమ్ రికార్డును తనే అధిగమించింది. పశ్చిమబంగా అథ్లెట్ మౌమిత 13.36 సెకన్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు
మహారాణిపేట : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నామినేషన్లు దాఖలుకు సోమవారం చివరి రోజు కాగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది నామినేషన్లు వేశారు. ఆఖరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్లను ఈనెల 11న పరిశీలన చేస్తారు. 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
గురుకుల సీవోఈలో ప్రవేశానికి దరఖాస్తులు
మధురవాడ: మధురవాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల బాలికల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ శాంతి కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 40 చొప్పున సీట్లు, 5వ తరగతిలో 80 సీట్లు ఉన్నట్టు తెలిపారు. ఆసక్తి కలిగిన బాలికలు https:// apbragcet. apcfss.in వెబ్‌సైట్ ద్వారా మార్చి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment