![వాల్తేరుకు వంచన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/08vsc21d-606377_mr-1739128678-0.jpg.webp?itok=7hEzbGVo)
వాల్తేరుకు వంచన
● కూటమి కుట్రకు కేకేలైన్ బలి
● పలాస కోసం ఆదాయ వనరును అప్పగించేశారు! ● కేకే లైన్ నుంచి కొత్త జోన్‌కి ఆదాయంపై అనుమానాలు ● విశాఖ నుంచి బయలుదేరే రైళ్లు శ్రీకాకుళం నుంచి నడిపేందుకు పావులు ● తొలుత గరీబ్ రథ్, తర్వాత గోదావరికి ప్రతిపాదనలు పంపిన నేతలు ● మరోవైపు వాల్తేరు రైళ్లపై కొనసాగుతున్న దక్షిణ మధ్య రైల్వే వివక్ష ● 230 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఎల్‌టీటీ 10 రోజులు రద్దు
కూటమి కుట్రలకు వాల్తేరు డివిజన్ బలైపోయింది. ఆదాయార్జనలో నంబర్ వన్ డివిజన్‌గా నిలిపిన కేకే లైన్‌ను విశాఖకు కానివ్వకుండా కూటమి ఎంపీ కుయుక్తులు పన్నారు. కేవలం పలాస రైల్వే స్టేషన్ కోసం కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్‌ను అప్పనంగా అప్పగించేశారు. కేకే లైన్ విశాఖ జోన్‌లోనే ఉన్నా.. రవాణా చార్జీల వసూళ్లన్నీ రాయగడ డివిజన్‌లో జరగనుండడంతో ఆదాయ పంపకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విశాఖవాసులు దుమ్మెత్తిపోస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం : కేంద్ర కేబినెట్ ఆమోదంతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయినప్పటికీ ఉత్తరాంధ్ర వాసుల్లో కించిత్ కూడా ఆనందం లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం. సుమారు శతాబ్దంన్నర చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను కాలగర్భంలో కలిపేసింది. గుండెకాయ లేకుండా పునర్విభజన చేసింది. ప్రస్తుతం ఉన్న డివిజన్‌కు కొండంత ఆదాయం తెచ్చే కేకే లైన్‌ను ఈస్ట్‌కోస్ట్ జోన్‌కు అప్పగించేసింది. దీంతో కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా జోన్‌కు, విశాఖ డివిజన్‌కు ఆదాయ మార్గాలు దాదాపు తగ్గుముఖం పట్టినట్లే. దీనికి కారణం కూటమి ఎంపీల ఒత్తిళ్లేనని స్పష్టమవుతోంది. తన జిల్లాలో రైల్వేపై పట్టు సాధించేందుకు ఒక ఎంపీ ఈ అడ్డగోలు విభజనకు రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఖుర్దా డివిజన్‌లో ఉన్న పలాసను విశాఖపట్నం డివిజన్‌కు ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే కేకే లైన్‌ను తమకు అప్పగిస్తే.. పలాసని వదులుకుంటామని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు ప్రతిపాదన ముందుంచారు. మరో మాట లేకుండా తన స్వలాభం కోసం అంగీకారం తెలపడంతో ఈ అడ్డగోలు విభజన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment