మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఆఖరి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌కు సంబంధిత పత్రాలను అందజేశారు. అభ్యర్థుల చేత రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా, సోమవారం వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల పర్వం ముగిసే సరికి 10 నామినేషన్లు దాఖలైనట్టు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. ఆ తరువాత పోటీలో ఎంతమంది ఉన్నారో స్పష్టమవుతుంది. అనంతరం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గుర్తుల కేటాయింపు, ఇతర ప్రక్రియలు కొనసాగుతాయని కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో భవానీ శంకర్, నోడల్ అధికారి దయానిధి పాల్గొన్నారు.
నామినేషన్లు వేసిన అభ్యర్థులు
కోసూరు రాధాకృష్ణ, పాకలపాటి రఘువర్మ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి, కోరెడ్ల విజయ గౌరి, నూకల సూర్యప్రకాశ్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు, పోతల దుర్గారావు, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు.
మొత్తం 10 నామినేషన్లు దాఖలు
Comments
Please login to add a commentAdd a comment