పారా న్యాయ సహాయకులు సేవలందించాలి
విశాఖ–లీగల్ : బడుగు,బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించేందుకు పారా న్యాయ సహాయకులు సహకారం అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా ఎంపికై న పారా న్యాయ సహాయకుల శిక్షణా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రాథమిక హక్కులు, విధులు, ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదు ఎలా చేయాలి, న్యాయ సహాయం పొందేందుకు అర్హతలు, కొత్త నేర న్యాయ చట్టాలను వివరించారు. నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ భారతీయ పీనల్ కోడ్, భారతీయ సాక్షి చట్టం, నూతన నేర న్యాయ చట్టాలను వివరించారు. సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.వెంకటరమణ నిందితులు, బాధితుల హక్కులు, అరెస్టులు, బెయిల్ తదితర అంశాలపై మాట్లాడారు. లోక్ అదాలత్‌లలో కేసులు రాజీ చేసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ, ఇతర న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment