![వైఎస్సార్‌సీపీలో యువతకు ప్రాధాన్యం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vscp113-600486_mr-1739215663-0.jpg.webp?itok=5bR0VJso)
వైఎస్సార్‌సీపీలో యువతకు ప్రాధాన్యం
సాక్షి, విశాఖపట్నం: యువత రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించాలని, వారిని ప్రోత్సహించడంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ ముందుంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. సీనియర్లు, యువకులు పార్టీ బలోపేతమే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. సోమవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో అమర్‌నాథ్ అధ్యక్షతన సమన్వయకర్తలు, అనుబంధ విభాగ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఎక్కువ మందిని యువకులనే నియమించామన్నారు. యువతను వెన్నుతట్టి ప్రోత్సహించే పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటేనన్నారు. జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమితులైన వారంతా పార్టీని ముందుండి నడిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సమన్వయకర్తలు కేకే రాజు, తిప్పల దేవన్‌రెడ్డి, పాక్టే కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు దొడ్డి కిరణ్, పేడాడ రమణి కుమారి, సనపల రవీంధ్ర భరత్, బోని శివ రామకృష్ణ, బర్కత్ అలీ, అద్దేపల్లి రవిబాబు, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, ఎస్.ప్రసాద్ రావు, చిక్కాల సత్యనారాయణ, రాయపు అనిల్ కుమార్, మేడిది ఆనందరావు, బాజీ నాయుడు, బోండా ఉమా మహేశ్వరరావు, వాసుపల్లి యల్లాజి, గున్నంటి పూర్ణానంద శర్మ, పార్టీ ముఖ్యనేతలు మొల్లి అప్పారావు, వంకాయల మారుతి ప్రసాద్, దేవరకొండ మార్కండేయులు, కార్పొరేటర్ పీవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి
సమన్వయకర్తలు, అనుబంధ విభాగ అధ్యక్షుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
Comments
Please login to add a commentAdd a comment