వందేభారత్‌లో సిగరెట్ పొగ
సాక్షి, విశాఖపట్నం: వందేభారత్ రైలులో సిగరెట్ పొగ కలకలం సృష్టించింది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు సోమవారం ఉదయం బయల్దేరిన వందేభారత్ రైలు బాత్‌రూమ్‌లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. బోగీ మొత్తం పొగ, సిగరెట్ వాసన రావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అక్కడికి వచ్చిన టీసీని నిలదీశారు. ట్రైన్‌లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి.. సిగరెట్ తాగిన ప్రయాణికుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సదరు టీసీ తనకేం సంబంధం లేదని, తానేం చెయ్యలేనంటూ ప్రయాణికులతో వాదనకు దిగారు. సిగరెట్ కారణంగా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే బాధ్యులెవరంటూ ప్రయాణికులు ప్రశ్నించారు. దీంతో టీసీ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. సిగరెట్ తాగిన ప్రయాణికుడ్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
కేకే లైన్‌లో రైళ్ల గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్, బచేలి–కిరండూల్ స్టేషన్‌ల పరిధిలో జరగుతున్న ఆధునికీకరణ పనుల నిమిత్తం కేకే లైన్‌లో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో దంతేవాడ వరకే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్ ఈ నెల 13 నుంచి మార్చి 6వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ మార్చి 7వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నం–కిరండూల్(18514) నైట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13 నుంచి మార్చి 6వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కిరండూల్–విశాఖపట్నం(18513) ఎక్స్‌ప్రెస్ మార్చి 7వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment